దొంగన్నారు.. దౌర్జన్యం చేశారు | suicide issue | Sakshi
Sakshi News home page

దొంగన్నారు.. దౌర్జన్యం చేశారు

Nov 4 2016 11:13 PM | Updated on Nov 6 2018 7:56 PM

చోరీ నేరం మోపి మనసునూ, దెబ్బలతో శరీరాన్నీ గాయపరచడంతో ఆ యువకుడు భరించలేకపోయాడు. అవమానభారంతో బతకడం కన్నా ఆత్మాహుతే మేలనుకున్నాడు. ఒంటిపై కిరోసి¯ŒS పోసుకుని నిప్పంటించుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కన్నవారికి జన్మంతా కడుపుకోత మిగిల్చాడు.కాకినాడ రామారావుపేటలోని రమ్య ఆస్పత్రి సమీపానున్న గొల్లపేటకు చెందిన మానుపూడి సత్యనారాయణ (18) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి.

  • అవమానభారంతో యువకుని ఆత్మహత్య 
  • వేధించిన యజమానిని అరెస్టు చేయాలన్న అమ్మానాన్న
  • కాకినాడ క్రైం :  
    చోరీ నేరం మోపి మనసునూ, దెబ్బలతో శరీరాన్నీ గాయపరచడంతో ఆ యువకుడు భరించలేకపోయాడు. అవమానభారంతో బతకడం కన్నా ఆత్మాహుతే మేలనుకున్నాడు. ఒంటిపై కిరోసి¯ŒS పోసుకుని నిప్పంటించుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కన్నవారికి జన్మంతా కడుపుకోత మిగిల్చాడు.కాకినాడ రామారావుపేటలోని రమ్య ఆస్పత్రి సమీపానున్న గొల్లపేటకు చెందిన  మానుపూడి సత్యనారాయణ (18) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి. 
    సత్యనారాయణ సూర్యారావుపేటలో ఉన్న శ్రీ నారాయణి స్ట్రక్చరల్‌ కంపెనీలో నాలుగు నెలలుగా ఆఫీస్‌బాయ్‌గా పనిచేస్తున్నాడు. గురువారం ఆఫీసులో డబ్బులు పోయాయంటూ సత్యనారాయణను కంపెనీ పార్టనర్‌ మూర్తి  వేధించారు. తనకు సంబంధంలేదని ఎంత చెప్పినా వినకుండా శుక్రవారం ఉదయం కొట్టారు. ఉదయం 10 గంటల సమయంలో అవమాన భారంతో కిరోసి¯ŒS పోసుకుని నిప్పంటించుకున్న సత్యనారాయణను 108లో కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు  రెండో పట్టణ పోలీసులు తెలిపారు.
     
    మూర్తిని అరెస్టు చేయాలి 
    తమ బిడ్డపై దొంగతనంనేరం మోపడమే కాక, ఆత్మహత్య చేసుకునేలా చేసి తమకు పుత్ర శోకాన్ని మిగిల్చిన మూర్తిని తక్షణమే అరెస్టు చేసి, హత్యాయత్నం కేసు నమోదు చేయాలని సత్యనారాయణ తల్లిదండ్రులు ఎం.గోవిందు, బుల్లమ్మ డిమాండ్‌ చేశారు. ఉదయం 9 గంటలకు ఆఫీసుకెళ్లిన వాడు 10.30 గంటలకు నిప్పంటించుకున్నాడని బోరున విలపించారు. మూర్తిని తక్షణం అరెస్టు చేసి హత్యాయత్నం కేసు పెట్టాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు బేబీరాణి డిమాండ్‌ చేశారు.
     
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement