
తాగునీటి కోసం రోడెక్కిన ఆశ్రమ విద్యార్థులు
మండలంలోని కొత్తపల్లి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో 280 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కొంత కాలంగా పాఠశాలలో తాగునీరు లేదు. సోమవారం తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ విద్యార్థులు మండలంలోని చౌడపూర్ గేటు దగ్గర రోడ్డుపై బైఠాయించారు.
కుల్కచర్ల: మండలంలోని కొత్తపల్లి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో 280 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కొంత కాలంగా పాఠశాలలో తాగునీరు లేదు. సోమవారం తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ విద్యార్థులు మండలంలోని చౌడపూర్ గేటు దగ్గర కుల్కచర్ల - నవాబుపేట రోడ్డుపై బైఠాయించారు.ఈ విషయం తెలుసుకున్న కుల్కచర్ల జెడ్పీటీసీ సభ్యురాలు మంజుల, పీఏసీఎస్ డైరెక్టర్ నాగరాజు సంఘటన స్థలానికి చేరుకుని విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచే ఆశ్రమ పాఠశాల వార్డెన్, గిరిజనశాఖ తాలుకా, జిల్లా అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ఆశ్రమ పాఠశాలలో కొత్తబోరు వేయిస్తానని జెడ్పీటీసీ హామీ ఇచ్చి విద్యార్థులను పాఠశాలకు పంపించారు. ఈ విషయంపై ఆశ్రమ పాఠశాల వార్డెన్ నరేందర్‌ను వివరణ కోరగా ఆశ్రమ పాఠశాలలో నీటి ఎద్దడి ఉన్నది వాస్తవమేనన్నారు. ఈ విషయం పై అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్లడం జరిగిందని తెలిపారు.