బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థుల ధర్నా | students strike for rtc bus | Sakshi
Sakshi News home page

బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థుల ధర్నా

Aug 1 2016 5:51 PM | Updated on Sep 4 2017 7:22 AM

బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థుల ధర్నా

బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థుల ధర్నా

: మండల పరిధిలోని సిరిపురం గ్రామానికి కోదాడ నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలంటూ సోమవారం ఆ గ్రామానికి చెందిన విద్యార్థులు సిరిపురంలో చెన్నకేశ్వాపురంలో ఆర్టీసీ బస్సును అడ్డుకొని ధర్నా నిర్వహించారు.

నడిగూడెం: మండల పరిధిలోని సిరిపురం గ్రామానికి కోదాడ నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలంటూ సోమవారం ఆ గ్రామానికి చెందిన విద్యార్థులు సిరిపురంలో చెన్నకేశ్వాపురంలో ఆర్టీసీ బస్సును అడ్డుకొని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ కళాశాలలు ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా సంబంధిత అధికారులు మాత్రం సిరిపురానికి బస్సు సౌకర్యం కల్పించడంలేదన్నారు. బస్సు సౌకర్యం లేకపోవడంతో సిరిపురం, వల్లాపురం, త్రిపురవరం గ్రామాలకు చెందిన వందలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లు వారు తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే బస్సు సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement