ఈతకు వెళ్లిన బీటెక్ విద్యార్థులు గల్లంతు | students drown in reservoir in chittoor district | Sakshi
Sakshi News home page

ఈతకు వెళ్లిన బీటెక్ విద్యార్థులు గల్లంతు

Aug 13 2016 10:04 AM | Updated on May 10 2018 12:34 PM

చిత్తూరు జిల్లా రామాపురం రిజర్వాయర్‌లో శనివారం ఈతకు వెళ్లిన ఇద్దరు బీటెక్ విద్యార్థులు గల్లంతయ్యారు.

తిరుపతి : చిత్తూరు జిల్లా రామాపురం రిజర్వాయర్‌లో శనివారం ఈతకు వెళ్లిన ఇద్దరు బీటెక్ విద్యార్థులు గల్లంతయ్యారు. తిరుపతి భవానీనగర్‌కు చెందిన జగదీష్, బాబి మరికొంతమంది స్నేహితులతో కలసి ఈతకు వెళ్లారు. రిజర్వాయర్‌లో నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో జగదీష్, బాబి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు.

తోటి స్నేహితులు వారి కోసం గాలించిన ప్రయోజనం కనిపించలేదు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని.. స్థానికుల సహాయంతో పోలీసులు రిజర్వాయర్‌లో గాలింపుచర్యలు  చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement