ఉరివేసుకొని విద్యార్థి మృతి | student suicide | Sakshi
Sakshi News home page

ఉరివేసుకొని విద్యార్థి మృతి

May 25 2017 12:06 AM | Updated on Nov 9 2018 5:02 PM

పెద్దహోతూరు గ్రామానికి చెందిన హోతూరప్ప, హనుమంతమ్మల మూడో కుమారుడు నరసింహ(14) అనే విద్యార్థి ఇంట్లో ఉరివేసుకొని బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆలూరు రూరల్‌: పెద్దహోతూరు గ్రామానికి చెందిన హోతూరప్ప, హనుమంతమ్మల మూడో కుమారుడు నరసింహ(14) అనే విద్యార్థి ఇంట్లో ఉరివేసుకొని బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పొలంపనులకు వెళ్లి ఇంటికి తిరిగొచ్చిన తల్లి హనుమంతమ్మ ఇంటిలో ఉరివేసుకున్న కుమారుడిని చూసి ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించింది. వారు హుటాహుటిన ఉరితాడు నుంచి విద్యార్థి నరసింహను కిందకు దించారు. బతికి ఉన్నాడన్న నమ్మకంతో చికిత్సల కోసం ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు ఆలూరు వైద్యసిబ్బంది తెలిపారు. విషయం తెలుసుకున్న ఆలూరు ఎస్‌ఐ ధనుంజయ, పోలీస్‌ సిబ్బంది ఆస్పత్రికి వెళ్లి నరసింహ మృతిపై విచారణ చేపట్టారు. నరసింహ ఆలూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి పూర్తి చేశాడు. కడుపునొప్పి తీవ్ర కావడంతోనే  తమ కుమారుడు ఉరివేసుకొని మృతిచెందినట్లు తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement