ప్రేమలో వేరై... చావులో ఒక్కటై! | Married woman and young man commit suicide by hanging | Sakshi
Sakshi News home page

ప్రేమలో వేరై... చావులో ఒక్కటై!

Jun 14 2026 4:32 AM | Updated on Jun 14 2026 4:32 AM

Married woman and young man commit suicide by hanging

ఉరేసుకుని వివాహిత, యువకుడి ఆత్మహత్య 

కొల్లాపూర్‌ మండలం ఎల్లూరులో ఘటన 

కొల్లాపూర్‌ రూరల్‌: వారిద్దరూ కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్నారు. వారి కులాలు వేరు కావడంతో కుటుంబ సభ్యులు పెళ్లికి అడ్డుచెప్పారు. యువతిని మరో యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇటీవల స్వగ్రామానికి వచ్చిన ఆమె.. ప్రేమించిన యువకుడు ఇద్దరూ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం ఎల్లూరు గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు ఎల్లూరుకు చెందిన తెలుగు శ్రీను కుమారుడు శివ (25), అదే గ్రామానికి చెందిన గొల్ల కర్రెన్న కూతురు రేణుక (21) కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. విషయం ఇరువురి కుటుంబాలకు తెలియడంతో పలుమార్లు మందలించారు. 

రెండేళ్ల క్రితం రేణుకను కొల్లాపూర్‌ మండలం ముక్కిడిగుండం గ్రామానికి చెందిన సమీప బంధువు గొల్ల కృష్ణకు ఇచ్చి పెళ్లి చేశారు. శివకు పెళ్లి కాలేదు. ఏడాది క్రితం రేణుకకు కూతురు జన్మించింది. అయితే భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు చోటు చేసుకోవడంతో కొంతకాలం హైదరాబాద్‌కు వలస వెళ్లారు. ఇటీవలే ముక్కిడిగుండం గ్రామానికి వచ్చారు. ఈక్రమంలోనే వారం రోజుల క్రితం రేణుక ఎల్లూరుకు వచ్చింది. శుక్రవారం రాత్రి అందరూ నిద్రించాక ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు వెతికినా ఆచూకీ లభించలేదు. చివరకు గ్రామ సమీపంలోని మామిడి తోటలో రేణుక, శివ ఉరేసుకుని విగతజీవులుగా కనిపించారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement