విద్యార్థిని మృతి | Student killed | Sakshi
Sakshi News home page

విద్యార్థిని మృతి

Jul 27 2016 6:51 PM | Updated on Sep 4 2017 6:35 AM

విద్యార్థిని మృతి

విద్యార్థిని మృతి

అనారోగ్యంతో ఓ విద్యార్థిని మృతి చెందింది.

సిద్దిపేట రూరల్‌: అనారోగ్యంతో ఓ విద్యార్థిని మృతి చెందింది. రాఘవాపూర్‌ గ్రామానికి చెందిన రేణిగుంట పద్మ, సత్తయ్యల రెండో కుమార్తె మానస (17) సిద్దిపేట పట్టణంలో ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. రోజు మాదిరిగానే సోమవారం కళాశాలకు వెళ్లి సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చింది.

ఈ క్రమంలో మానసకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో కుటుంబీకులు తగ్గుతాయని అనుకుని ఇంటి వద్దే ఉంచారు. మంగళవారం ఉదయం మరిం‍త ఎక్కువ కావడంతో వెంటనే ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సలహా మేరకు సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ రాత్రి మృతి చెందింది. మానస తల్లిదండ్రులు నిరుపేద కుటుంబానికి చెందిన వారని, ఆ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement