సెల్ చార్జింగ్ పెడుతూ విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి చెందిన సంఘటన పెద్దఅడిశర్లపల్లి మండలంలోని పోల్కంపల్లి గ్రామపంచాయతీ మాదాపూర్‌తండాలో శనివారం రాత్రి చోటు చేసుకుంది.
సెల్‌చార్జింగ్ పెడుతూ విద్యార్థి మృతి
Aug 13 2016 11:49 PM | Updated on Nov 9 2018 5:02 PM
పెద్దఅడిశర్లపల్లి : సెల్ చార్జింగ్ పెడుతూ విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి చెందిన సంఘటన పెద్దఅడిశర్లపల్లి మండలంలోని పోల్కంపల్లి గ్రామపంచాయతీ మాదాపూర్‌తండాలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... రమావత్ హన్మంతు మాదాపూర్‌తండాలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. హన్మంతుకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు రమావత్ సంజీవ్ (16) కోదాడ పట్టణంలో ఉంటూ పదోతరగతి చదువుతున్నాడు. వరుసగా రెండవ శనివారం, ఆదివారం, ఆగస్టు 15 సెలవు దినాలు ఉండడంతో పుష్కరాల కోసమని తన స్వ గ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంట్లో సెల్‌చార్జింగ్ పెడుతుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురై సంజీవ్ అక్కడిక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Advertisement


