బీబీనగర్ : రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి.
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
Sep 19 2016 11:00 PM | Updated on Apr 3 2019 7:53 PM
బీబీనగర్ : రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని కొండమడుగు మెట్టు వద్ద సోమవారం సాయంత్రం జరిగింది. స్థానికులు, 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లా గోదావరిఖనికి చెందిన అన్నదమ్ములు బోగ జిత్తీష్‌రాజు, కులదీప్‌లు బీబీనగర్ మండలం గూడూరు పరిధిలోని టీడీఆర్ ఇంజనీర్ కళాశాలలో బీటెక్ చదువుతున్నారు. వీరు ఇద్దరు హైదరాబాద్‌లోని నివాసముంటూ రోజు కళాశాలకు వచ్చి వెళ్తున్నారు. కాగా సోమవారం ద్విచక్రవాహనంపై వచ్చిన అన్నదమ్ములు ఇద్దరు కళాశాల ముగిసిన అనంతరం తిరిగి బైక్‌పై వెళ్తున్నారు. కొండమడుగు మెట్టు సమీపంలోని జైన్ ఇరిగేషన్ పరిశ్రమ వద్ద ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పి పడిపోయింది. ఈసంఘటనలో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. వైద్యం కోసం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించగా జిత్తీష్‌రాజు(21) చికిత్స పొందుతూ మృతి చెందాడు. పరిస్థితి విషమంగా ఉన్న కులదీప్‌ను ఉప్పల్‌లోని ఆదిత్య ఆస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement