పాఠశాలకు ఎందుకు వెళ్లలేదని తల్లి మందలించడంతో.. మనస్తాపానికి గురైన విద్యార్థిని కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది.
పాఠశాలకు ఎందుకు వెళ్లలేదని తల్లి మందలించడంతో.. మనస్తాపానికి గురైన విద్యార్థిని కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం మండలం రామ్‌నగర్‌లో గురువారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన అలేఖ్య ఈ రోజు పాఠశాలకు వెళ్లకపోవడంతో.. తల్లి ఎందుకు వెళ్లలేదని మందలించింది. దీంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో వంటి పై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఇంట్లో నుంచి మంటలతో పాటు కేకలు రావడం గుర్తించిన స్థానికులు మంటలు ఆర్పి ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.