ఉరేసుకుని విద్యార్థి బలవన్మరణం | student commits suicide in Hyderabad | Sakshi
Sakshi News home page

ఉరేసుకుని విద్యార్థి బలవన్మరణం

Apr 22 2016 7:59 AM | Updated on Nov 9 2018 5:02 PM

రంగారెడ్డి జిల్లా దుండిగల్‌లోని ఓ కార్పొరేట్ కళాశాలలో ఒక విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

దుండిగల్(రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లా దుండిగల్‌లోని ఓ కార్పొరేట్ కళాశాలలో ఒక విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కళాశాలకు చెందిన హాస్టల్ ఉంటున్న అమర్(17) గురువారం రాత్రి తన గదిలో ఫ్యానుకు ఉరేసుకున్నాడు. శుక్రవారం ఉదయం నిర్వాహకులు గమనించేసరికి చనిపోయి ఉన్నాడు.
విషయం తెలిసి సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement