వివక్షత చూపితే కఠిన చర్యలు | Strict action against discrimination | Sakshi
Sakshi News home page

వివక్షత చూపితే కఠిన చర్యలు

Oct 22 2016 1:25 AM | Updated on Oct 20 2018 6:19 PM

వివక్షత చూపితే కఠిన చర్యలు - Sakshi

వివక్షత చూపితే కఠిన చర్యలు

నెల్లూరు(సెంట్రల్‌): సమాజంలో దళితులపై ఎవరైనా వివక్షత చూపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సీ ,ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజి పేర్కొన్నారు. నగరంలోని అంబేడ్కర్‌ భవన్‌లో శుక్రవారం జరిగిన ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమైఖ్య సదస్సులో ఆయన మాట్లాడారు.

  • ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజి
  • నెల్లూరు(సెంట్రల్‌):
    సమాజంలో దళితులపై ఎవరైనా వివక్షత చూపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సీ ,ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజి పేర్కొన్నారు. నగరంలోని అంబేడ్కర్‌ భవన్‌లో శుక్రవారం జరిగిన ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమైఖ్య సదస్సులో ఆయన మాట్లాడారు. అంబేడ్కర్‌ ఆశయాలకు అనుగుణంగా దళితులు పనిచేయాలన్నారు. బాబాసాహెబ్‌ సిద్ధాంతాలను పాటిస్తూ తోటి దళితులకు సాయంచేయాలని సూచించారు. ఉద్యోగులు కూడా కలసికట్టుగా ఉన్నప్పుడే సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ముఖ్యంగా దళితులు  ఆత్మగౌరవం కోసం పోరాడాలని సూచించారు. వ్యవస్థలో మార్పులు వచ్చి దళితులు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకు పోవాలన్నారు. నెల్లూరులో అధునాతన వసతులతో రూ.5 కోట్లతో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ భవన నిర్మాణం త్వరలోనే చేపడుతున్నట్లు పేర్కొన్నారు. బహుజన మెడికల్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ జిల్లా అ«ధ్యక్షుడు విడవలూరు శ్రీకాంత్‌ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో ఉద్యోగులును సమాయత్తం చేసి సంఘం అందరినీ ఏక తాటిపై నిలిపుతామన్నారు. సదస్సులో  రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు ఎజ్రా శాస్త్రి, శివ శీనయ్య, బొడ్డు ప్రసాద్, పల్లి నరసింహులు, అమారిహనోక్, ప్రసాద్‌ పాల్గొన్నారు.
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement