కుక్కల దాడిలో 16 గొర్రెలు మృతి | Stray dogs kill 16 sheeps | Sakshi
Sakshi News home page

కుక్కల దాడిలో 16 గొర్రెలు మృతి

Jun 2 2016 6:44 PM | Updated on Sep 4 2017 1:30 AM

గొర్రెల మందపై ఊర కుక్కలు దాడి చేసి బీభత్సం సృష్టించాయి.

వర్గల్ (మెదక్) : గొర్రెల మందపై ఊర కుక్కలు దాడి చేసి బీభత్సం సృష్టించాయి. దీంతో 16 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. ఈ సంఘటన గురువారం మెదక్ జిల్లా వర్గల్ మండలం తున్కిఖాల్సాలో కలకలం రేపింది. గ్రామానికి చెందిన అయ్యల్లం గొర్రెల కాపరి. బుధవారం రాత్రి గొర్రెలను గ్రామంలోని తన కొట్టంలో ఉంచాడు. కొట్టంలోకి చొరబడిన ఊర కుక్కలు దాదాపు 100 వరకు ఉన్న గొర్రెల మందపై ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ దాడిలో 16 గొర్రెలు అక్కడికక్కడే చనిపోగా, 10 వరకు తీవ్రంగా గాయాలపాలయ్యాయి. గురువారం ఉదయం కొట్టం వద్దకు వెళ్లిన అయ్యల్లం గొర్రెలు మృతి చెంది కన్పించడంతో బోరుమన్నాడు. తనకు రూ.లక్ష వరకు నష్టం వాటిల్లిందన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement