వేతనాలు ఇచ్చే వరకు నీటి సరఫరా బంద్‌ | stopped water supply | Sakshi
Sakshi News home page

వేతనాలు ఇచ్చే వరకు నీటి సరఫరా బంద్‌

Jul 25 2016 12:01 AM | Updated on Sep 4 2017 6:04 AM

మండల కేంద్రంలోని ఫిల్టర్‌బెడ్‌లో పని చేసే కార్మికులకు వేతనాలు ఇచ్చే వరకు తాగునీటి సరఫరా బంద్‌ చేస్తున్నట్లు ఫిల్టర్‌బెడ్‌ లైన్‌మెన్‌ పంతంగి యాదగిరి తెలిపారు. ఈ మేరకు ఫిల్టర్‌బెడ్‌ ఆవరణలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. గత ఎనిమిది నెలలుగా సుమారు రూ.2.5లక్షల వేతనాలు తమకు రావాల్సి ఉందన్నారు.

ఖానాపురం : మండల కేంద్రంలోని ఫిల్టర్‌బెడ్‌లో పని చేసే కార్మికులకు వేతనాలు ఇచ్చే వరకు తాగునీటి సరఫరా బంద్‌ చేస్తున్నట్లు ఫిల్టర్‌బెడ్‌ లైన్‌మెన్‌ పంతంగి యాదగిరి తెలిపారు. ఈ మేరకు ఫిల్టర్‌బెడ్‌ ఆవరణలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. గత ఎనిమిది నెలలుగా సుమారు రూ.2.5లక్షల వేతనాలు తమకు రావాల్సి ఉందన్నారు.
 
ఎన్నిమార్లు డీఈ వెంకట్రాంరెడ్డి దృష్టికి తీసుకువెళ్లినా బిల్లులు విషయాన్ని సాకుగా చూపుతున్నారని తెలిపారు. నిధుల విడుదల కాన ప్పుడు తానేం చేయాలంటూ సమాధానమిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వేతనాలు ఇచ్చే వరకు ఫిల్టర్‌బెడ్‌ ద్వారా నీటి సరఫరా బంద్‌ చేయడంతో పాటు విధులకు హాజరుకావొద్దని నిర్ణయించుకున్నట్లు యాదగిరి తెలిపారు. సమావేశంలో సిబ్బంది అమ్మ అశోక్, పంతంగి వేణు, శ్యాం, జలీల్‌ పాల్గొన్నారు. 
  

Advertisement
 
Advertisement
Advertisement