breaking news
water supply stopped
-
వేతనాలు ఇచ్చే వరకు నీటి సరఫరా బంద్
ఖానాపురం : మండల కేంద్రంలోని ఫిల్టర్‌బెడ్‌లో పని చేసే కార్మికులకు వేతనాలు ఇచ్చే వరకు తాగునీటి సరఫరా బంద్ చేస్తున్నట్లు ఫిల్టర్‌బెడ్ లైన్మెన్ పంతంగి యాదగిరి తెలిపారు. ఈ మేరకు ఫిల్టర్‌బెడ్ ఆవరణలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. గత ఎనిమిది నెలలుగా సుమారు రూ.2.5లక్షల వేతనాలు తమకు రావాల్సి ఉందన్నారు. ఎన్నిమార్లు డీఈ వెంకట్రాంరెడ్డి దృష్టికి తీసుకువెళ్లినా బిల్లులు విషయాన్ని సాకుగా చూపుతున్నారని తెలిపారు. నిధుల విడుదల కాన ప్పుడు తానేం చేయాలంటూ సమాధానమిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వేతనాలు ఇచ్చే వరకు ఫిల్టర్‌బెడ్ ద్వారా నీటి సరఫరా బంద్ చేయడంతో పాటు విధులకు హాజరుకావొద్దని నిర్ణయించుకున్నట్లు యాదగిరి తెలిపారు. సమావేశంలో సిబ్బంది అమ్మ అశోక్, పంతంగి వేణు, శ్యాం, జలీల్ పాల్గొన్నారు. -
మంత్రి మాటలు నీటి మూటలు
కూడేరు, న్యూస్‌లైన్: కూడేరు మండల పరిధిలోని పీఏబీఆర్ డ్యాం నుంచి ధర్మవరం కుడికాలువకు బుధవారం నీటి సరఫరాను అధికారులు నిలిపి వేశారు. చెరువులను నీటితో నింపుతామన్న మంత్రి రఘువీరారెడ్డి, ఎంపీ అనంతవెంకటరెడ్డి ఆదేశాలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. వివరాల్లోకి వెళితే ‘జీడిపల్లి జలాశయం నుంచి పీఏబీఆర్ డ్యాంకు 400 క్యూసెక్కులు నీటిని విడుదల చేయించాను. కుడికాలువ కు రోజు 300 క్యూసెక్కులు నీటిని విడుదల చేయండి’ అని గత నెల 27న పీఏబీఆర్ డ్యాంను సందర్శించిన సందర్భంగా హెచ్ఎల్సీ అధికారులకు మంత్రి రఘువీరారెడ్డి ఆదేశించారు. కాని జీడిపల్లి జలాశయం నుంచి వస్తున్న నీరు నాలుగు రోజులు కిందట ఆగిపోయింది. ప్రస్తుతం డ్యాంలో 1.45 టీఎసీల నీరు నిల్వ ఉంది. తాగునీటి ప్రాజెక్టులకు నీటి సరఫరాను దృష్టిలో పెట్టుకొని డ్యాంకు ఇన్ఫ్లోలేనందున కుడికాలువకు నీటి సరఫరాను అధికారులు బంద్ చేసినట్లు సమాచారం. డ్యాంలో ఇన్‌ఫ్లో పెరిగితేనే కుడికాలువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉందని అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. తుంగభద్ర డ్యాం నుంచి కేటాయింపు మేరకు , జీడిపల్లి జలాశయం నుంచి నికర జలాలను తెప్పించడంలో మంత్రి, ఎంపీ అనంతవెంకటరెడ్డి విఫలమైయ్యారని ప్రజలు నుంచి విమర్శలు వెల్లువెత్తున్నాయి. కుడికాలువ కింద ఉన్న 49 చెరువులకు నీరు చేరే పరిస్థితులు లేవు. దీంతో రైతులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కుడికాలువ నీటి విడుదలపై శ్రద్ధ చూపి చెరువులను నీటితో నింపాలని రైతులు, ప్రజలు మంత్రిని కోరుతున్నారు.