పెండింగ్ వేతనాలు చెల్లించాలి: తమ్మినేని | Tammineni Veerabhadram about Pending wages of Laborer | Sakshi
Sakshi News home page

పెండింగ్ వేతనాలు చెల్లించాలి: తమ్మినేని

Nov 1 2016 2:03 AM | Updated on Sep 5 2018 8:24 PM

పెండింగ్ వేతనాలు చెల్లించాలి: తమ్మినేని - Sakshi

పెండింగ్ వేతనాలు చెల్లించాలి: తమ్మినేని

ఉపాధి హామీ పథకం లో భాగంగా రాష్ట్రంలో రూ.200 కోట్ల మేర పెండింగ్‌లో ఉన్న కూలీల వేతనాలను వెంటనే చెల్లించేం దుకు చర్యలు తీసుకోవాలని సీపీఎం విజ్ఞప్తి చేసింది.

సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ పథకం లో భాగంగా రాష్ట్రంలో రూ.200 కోట్ల మేర పెండింగ్‌లో ఉన్న కూలీల వేతనాలను వెంటనే చెల్లించేం దుకు చర్యలు తీసుకోవాలని సీపీఎం విజ్ఞప్తి చేసింది. హరితహారం పనులు చేసి 4 నెలలు గడుస్తున్నా కూలీలకు డబ్బులు విడుదల కాలేదంది. ప్రస్తుతం జరుగుతున్న అవకతవకలను సరిదిద్ది, ఉపాధి హామీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని సోమవారం సీఎంకు రాసిన లేఖలో ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు.

ఈ పథకానికి బడ్జెట్‌లో  రాష్ట్రం కేటాయిస్తున్న 10శాతం నిధులను ఖర్చు చేయడం లేదన్నారు. 90 శాతం కేంద్రం నిధులను కూడా ఇతర శాఖల్లోని అవసరాలకు ప్రభుత్వం వాడుకుంటోందన్నారు. అందువల్ల ఉపాధి కూలీలకు చట్టంలో పేర్కొన్న విధంగా వేతనాలు చెల్లించడంలో జాప్యం జరుగుతోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement