రాష్ట్రస్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభం | state level cricket tournament starts | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

Sep 26 2016 10:52 PM | Updated on Sep 4 2017 3:05 PM

క్రికెట్‌ టోర్నీ ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న ప్రిన్సిపాల్‌ రామలింగారెడ్డి

క్రికెట్‌ టోర్నీ ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న ప్రిన్సిపాల్‌ రామలింగారెడ్డి

చిత్తూరు రోడ్డులోని ఆదిత్య ఇంజినీరింగ్‌ కాలేజీలో సోమవారం రాష్టస్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌–2016ను ప్రన్సిపాల్‌ రామలింగారెడ్డి ప్రారంభించారు. ఇందులో వివిధ జిల్లాల నుంచి 16 జట్లు పాల్గొన్నాయి.

 మదనపల్లె సిటీ : చిత్తూరు రోడ్డులోని ఆదిత్య ఇంజినీరింగ్‌ కాలేజీలో సోమవారం రాష్టస్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌–2016ను ప్రన్సిపాల్‌ రామలింగారెడ్డి ప్రారంభించారు. ఇందులో వివిధ జిల్లాల నుంచి 16 జట్లు పాల్గొన్నాయి. కాలేజీ ౖచైర్మన్‌ రామమోహన్‌రెడ్డి మాట్లాడుతూ మొదటి బహుమతి రూ.25 వేలు, ద్వితీయ బహుమతి రూ.15 వేలు, ప్రత్యేక ట్రోఫీలు అందజేస్తామన్నారు. ఈ పోటీలు నాలుగు రోజుల పాటు జరుగుతాయని తెలిపారు. మొదటిరోజు పోటీల్లో సీతమ్‌ (చిత్తూరు), ఎస్వీసీఈ (తిరుపతి) జట్ల మధ్య తొలిమ్యాచ్‌ జరింగింది. ఇందులో సీతమ్‌ జట్టు 28 పరుగుల తేడాతో గెలుపొందింది. మరోమ్యాచ్‌లో ఎస్వీసెట్‌ (చిత్తూరు), సిద్దార్థ (తిరుపతి) జట్లు పోటీపడగా 83 పరుగులతో తేడాతో ఎస్వీసెట్‌ (చిత్తూరు) విద్యార్థులు గెలుపొందారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement