తిరుమలలో శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన | Srilanka Presedent, Lord Venkatesa | Sakshi
Sakshi News home page

తిరుమలలో శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన

Aug 20 2016 10:44 PM | Updated on Nov 9 2018 6:46 PM

శ్రీలంక అ«ధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు పుష్పగుచ్ఛంతో స్వాగతంపలుకుతున్న టీటీడీ చైర్మన్‌  ఈవో - Sakshi

శ్రీలంక అ«ధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు పుష్పగుచ్ఛంతో స్వాగతంపలుకుతున్న టీటీడీ చైర్మన్‌ ఈవో

శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన శనివారం తిరుమలకు చేరుకున్నారు.

సాక్షి, తిరుమల : శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన శనివారం తిరుమలకు చేరుకున్నారు. సతీమణ , కుటుంబ సభ్యులు, మొత్తం 40 మంది ప్రతినిధుల బృందంతో రాత్రి శ్రీకృష్ణ అతిథిగృహానికి చేరుకున్నారు. టీటీడీ చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్‌ దొండపాటి సాంబశివరావు పుష్పగుచ్ఛంతో సిరిసేనకు ఘనంగా స్వాగతం పలికారు. శ్రీలంక అధ్యక్షుడి హోదాలో ఆయన రెండోసారి ఆదివారం వేకువజామున సుప్రభాత సేవలో శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోనున్నారు. సిరిసేన రాక సందర్భంగా అనంతపురం రేంజ్‌ డీఐజీ ప్రభాకర్‌ రావు, తిరుపతి అర్బన్‌ జిల్లా ఎస్పీ జయలక్ష్మి గట్టి పోలీసు భద్రతను కల్పించారు. గత అనుభవాల దృష్ట్యా శ్రీలంక అధ్యక్షుడు ప్రయాణించే రోడ్డు మార్గంలో తమిళులు అడ్డుకోవటం లాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. భద్రతా కారణాల రీత్యా  కాన్వాయ్‌లోని వాహనాల మార్పులు చేర్పుల మధ్య సిరిసేన తిరుమలకు చేరుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement