breaking news
Lord Venkatesa
-
షూస్ వేసుకొని వెంకన్న విగ్రహం తీసుకున్న కేంద్ర మంత్రి పెమ్మసాని
-
తిరుమలలో శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన
సాక్షి, తిరుమల : శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన శనివారం తిరుమలకు చేరుకున్నారు. సతీమణ , కుటుంబ సభ్యులు, మొత్తం 40 మంది ప్రతినిధుల బృందంతో రాత్రి శ్రీకృష్ణ అతిథిగృహానికి చేరుకున్నారు. టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు పుష్పగుచ్ఛంతో సిరిసేనకు ఘనంగా స్వాగతం పలికారు. శ్రీలంక అధ్యక్షుడి హోదాలో ఆయన రెండోసారి ఆదివారం వేకువజామున సుప్రభాత సేవలో శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోనున్నారు. సిరిసేన రాక సందర్భంగా అనంతపురం రేంజ్ డీఐజీ ప్రభాకర్ రావు, తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ జయలక్ష్మి గట్టి పోలీసు భద్రతను కల్పించారు. గత అనుభవాల దృష్ట్యా శ్రీలంక అధ్యక్షుడు ప్రయాణించే రోడ్డు మార్గంలో తమిళులు అడ్డుకోవటం లాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. భద్రతా కారణాల రీత్యా కాన్వాయ్‌లోని వాహనాల మార్పులు చేర్పుల మధ్య సిరిసేన తిరుమలకు చేరుకున్నారు.


