విజయవాడలో శ్రీలంక దేశస్థుడు అదృశ్యం | sri lanka man missing and case filed in vijayawada | Sakshi
Sakshi News home page

విజయవాడలో శ్రీలంక దేశస్థుడు అదృశ్యం

Nov 1 2016 10:32 AM | Updated on Sep 4 2017 6:53 PM

కృష్ణా జిల్లా విజయవాడలో శ్రీలంక దేశస్థుడు స్టీవెన్ రత్నాయక్ అదృశ్యం కలకలం రేపింది.

విజయవాడ: కృష్ణా జిల్లా విజయవాడలో శ్రీలంక దేశస్థుడు స్టీవెన్ రత్నాయక్ అదృశ్యం కలకలం రేపింది. గత పదిహేను రోజులుగా అతడి ఆచూకీ తెలియకుండా పోయింది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీలంకకు చెందిన రత్నాయక్ అక్టోబర్ 15న ఉదయం 11 గంటలకు తమిళనాడు ఎక్స్ ప్రెస్ రైలులో చెన్నై నుంచి హైదరాబాద్ కు బయలుదేరాడు. ఈ క్రమంలో విజయవాడ రైల్వేస్టేషన్లో అతడు అదృశ్యమయ్యాడు.

ఈ విషయంపై లంక హై కమిషన్ విజయవాడ రైల్వేస్టేషన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే స్టీవెన్ ఏ పనిమీద వచ్చాడు.. అతడు ఏం చేస్తుంటాడన్న దానిపై స్పష్టమైన సమాచారం లేదు. ఈ ఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement