హోదాతోనే విద్యార్థులకు భవిష్యత్తు | Special status is importent | Sakshi
Sakshi News home page

హోదాతోనే విద్యార్థులకు భవిష్యత్తు

Aug 11 2016 10:14 PM | Updated on May 29 2018 4:26 PM

హోదాతోనే విద్యార్థులకు భవిష్యత్తు - Sakshi

హోదాతోనే విద్యార్థులకు భవిష్యత్తు

నాయుడుపేట : రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తేనే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని వైఎస్సార్‌ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు జీపీ శ్రావణ్‌కుమార్‌ అన్నారు.

 
 నాయుడుపేట : రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తేనే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని వైఎస్సార్‌ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు జీపీ శ్రావణ్‌కుమార్‌ అన్నారు. నాయుడుపేట పట్టణ పరిధిలోని ఆర్‌అండ్‌బీ అతిథిగహంలో గురువారం విద్యార్థులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో విద్యార్థులను అన్నివిధాలా ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం ప్రస్తుతం ఫీజు రాయితీలను అందకుండా చేస్తోందన్నారు. హోదా రాకపోతే విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారన్నారు. టీడీపీ హోదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. ఈకార్యక్రమంలో నాయుడుపేట పట్టణ యూత్‌ అధ్యక్షుడు వెంకటేష్, కార్యదర్శి సత్య, దినేష్, రాజేష్‌  పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement