నేటి నుంచి చౌడేశ్వరిదేవికి ప్రత్యేక పూజలు | special pujas for chowdeshwari from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి చౌడేశ్వరిదేవికి ప్రత్యేక పూజలు

Mar 28 2017 10:28 PM | Updated on Oct 5 2018 6:24 PM

నేటి నుంచి  చౌడేశ్వరిదేవికి ప్రత్యేక పూజలు - Sakshi

నేటి నుంచి చౌడేశ్వరిదేవికి ప్రత్యేక పూజలు

గ్రామంలో వెలసిన చౌడేశ్వరిదేవి రాయబారాది, జ్యోతి, మహోత్సవాలు బుధవారం నుంచి ఏప్రిల్‌ 4 వరకు ఉంటాయని ఆలయ కార్య నిర్వాణాధికారి రామానుజన్‌ మంగళవారం తెలిపారు.

నందవరం(బనగానపల్లె రూరల్‌): గ్రామంలో వెలసిన చౌడేశ్వరిదేవి రాయబారాది, జ్యోతి, మహోత్సవాలు బుధవారం నుంచి ఏప్రిల్‌ 4 వరకు ఉంటాయని ఆలయ కార్య నిర్వాణాధికారి రామానుజన్‌ మంగళవారం తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారి అంకురార్పణ, పంచాగ శ్రవణం, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు పన్నేరపు బండ్లు తిప్పడం తదితర కార్యక్రమాలుంటాయన్నారు. చౌడేశ్వరిదేవి జ్యోతి ఉత్సవాల సందర్భంగా పాణ్యం సీఐ పార్థసార««థిరెడ్డి ఆధ్వర్యంలో పటిష్ట పోలీసు బందో బస్తు ఏర్పాటు చేసినట్లు నందివర్గం ఎస్‌ఐ హనుమంతరెడ్డి తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement