'డీఎస్సీలో కూచిపూడి కోసం ప్రత్యేక పోస్టులు' | Special posts to be created in DSc exam for Kuchipudi Dance, says Ganta srinivasa rao | Sakshi
Sakshi News home page

'డీఎస్సీలో కూచిపూడి కోసం ప్రత్యేక పోస్టులు'

May 15 2016 3:25 PM | Updated on Sep 4 2017 12:10 AM

డీఎస్సీలో కూచిపూడి కోసం ప్రత్యేక పోస్టులు క్రియేట్‌ చేసి భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.

విశాఖ: డీఎస్సీలో కూచిపూడి కోసం ప్రత్యేక పోస్టులు క్రియేట్‌ చేసి భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం విశాఖపట్నంలోని కళాభారతిలో జరిగిన మంజునాథం ముగింపు కార్యక్రమంలో  ఆయన పాల్గొన్నారు. పోస్టులను భర్తీ చేసే ముందు మంజుభార్గవి లాంటి కళాకారులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రతి ప్రారంభోత్సవ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన అనంతరం కూచిపూడి నృత్యం ఉండేలా చర్యలు తీసుకుంటామని మంత్రి గంటా పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి మంజుభార్గవి మాట్లాడుతూ.. కూచిపూడి వర్క్‌షాపు నిర్వహించాలంటే కనీసం నెలరోజులైనా సమయం ఉండాలని సూచించారు. కూచిపూడి కళాభివృద్ధికి ఏపీ ప్రభుత్వం తోడునీడగా నిలవాలని మంజుభార్గవి కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement