రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయూలు తెలుసుకోకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియూగాంధీ.
వడమాలపేట,న్యూస్‌లైన్: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయూలు తెలుసుకోకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియూగాంధీ నియంతలా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మం డలి సభ్యురాలు ఆర్కేరోజా ఆరోపించారు. శనివారం ఆమె మండలంలో పర్యటించారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన వారితో మాట్లాడారు. అప్పలాయి గుంటలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పా టు విషయం ముందే తెలిసినా మిన్నకుండిన కాంగ్రెస్ నాయకులు ఇప్పడు ప్రజల మెప్పు పొందడానికి నటిస్తున్నారని విమర్శించారు.
నేడు రాష్ట్రం గడ్డుపరిస్థితులలో ఉందని, ప్రజలు అనేక సమస్యలతో అల్లాడుతున్నారన్నారు. తిరిగి మంచిరోజులు రావాలన్నా, రా జన్నపాలన చూడాలన్నా వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ము ఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని ప్రజలు విశ్వసిస్తున్నారని తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. నాయకులు సురేష్‌కుమార్, మురళిరెడ్డి, ఉమాపతి, లో కేష్‌రెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి, సుధీర్‌రెడ్డి, జయచంద్రారెడ్డి, ఉమాపతి, తులసీరెడ్డి, భాస్కర్‌రాజు, జయచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు.