మంట గలిసిన మానవత్వం | Sakshi
Sakshi News home page

మంట గలిసిన మానవత్వం

Published Sun, May 29 2016 6:41 AM

మంట గలిసిన మానవత్వం

ఆస్తి తగాదాలో తల్లి, తమ్ముడిపై కత్తితో దాడి
తీవ్రగాయాలపాలై ఆస్పత్రికి బాధితులు
నిందితులను పట్టుకుని రిమాండ్ చేసిన పోలీసులు

 దౌల్తాబాద్: సమాజంలో మానవత్వం మంటగలిసిపోతోంది. ఆస్తిపాస్తుల విషయంలో కని, పెంచిన మమకారం, తోడ బుట్టిన ఆత్మీయతానుబంధాలు ఏమాత్రం క న్పించడం లేదు. కక్షలు.. ప్రతీకారాలతో దాడులు, ప్రతిదాడులకు దిగుతున్నారు. ప్రాణాలు తీసేందుకు సైతం వెనుకాడడం లేదు. మండలం కోనాపూర్‌లో ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. ఆస్తి విషయంలో గొడవలకు దిగి కన్నతల్లితోపాటు తోడబుట్టిన సోదరుడిని హతమార్చేందుకు యత్నించాడు ఓ ప్రబుద్ధుడు. అతడి భార్య సైతం మద్దతు తెలిపి దాడికి తెగబడింది. ప్రస్తుతం గాయపడిన తల్లీ, కొడుకులు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. దౌల్తాబాద్ ఎస్సై పరుశురాం తెలిపిన మేరకు వివరాల్లోకి వెళితే..

మండలంలోని కోనాపూర్‌కు చెందిన పంచం బాలయ్య, శ్యామల దంపతులు హైదరాబాద్‌లో నివాసముంటూ కూలీ పనులు చేసుకుంటారు. కాగా స్వగ్రామం కోనాపూర్‌లో ఆస్తి విషయంలో బాలయ్య సోదరులు వెంకటయ్య, శ్రీనివాస్‌లతో వివాదం కొనసాగుతోంది. మాట్లాడుకునేందుక ని మంగళవారం బాలయ్య దంపతులు గ్రామానికి వచ్చారు. కాగా అదేరోజు రాత్రి 11గంటల ప్రాంతంలో బాలయ్య తన సోదరుడు వెంకటయ్య, తల్లి సత్తవ్వతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో వారిపై వ్యవసాయ పనిముట్లతోపాటు కత్తితో దాడి చేశాడు. అక్కడి నుంచి పరుగెత్తుతున్న వెంకటయ్యను వెంటాడాడు.

బాలయ్య భార్య శ్యామల గొడ్డలితో వెంటాడి భర్తకు సాయంగా నిలిచింది. బాలయ్య దాడిలో వెంకటయ్యతోపాటు సత్తవ్వలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు విషయం గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై పరుశురాం అక్కడికి చేరుకుని క్షతగాత్రులను గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. ఆపై గాంధీ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ వారిద్దరు చికిత్సపొందుతున్నారు.

నిందితుల రిమాండ్
కాగా కోనాపూర్‌లో దాడికి పాల్పడిన నిం దితులు పంచం బాలయ్య, శ్యామలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తలిపారు.సంఘటన స్థలానికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పా రు. బుధవారం వారిని గజ్వేల్ కోర్టులో హాజరు పరిచామని, ఆపై సిద్దిపేట సబ్ జైలుకు తరలించినట్లు వివరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement