సాఫ్ట్‌బాల్‌ జట్ల ఎంపిక | softball team elected | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌బాల్‌ జట్ల ఎంపిక

Aug 24 2016 12:50 AM | Updated on Jun 1 2018 8:39 PM

జిల్లా సాఫ్ట్‌బాల్‌ జిల్లా జట్ల ఎంపిక అనంత క్రీడాగ్రామంలో మంగళవారం జరిగింది.

అనంతపురం సప్తగిరిసర్కిల్‌ : జిల్లా సాఫ్ట్‌బాల్‌ జిల్లా జట్ల ఎంపిక అనంత క్రీడాగ్రామంలో మంగళవారం  జరిగింది. జిల్లా విద్యాశాఖాధికారి అంజయ్య, ఎస్‌ఎస్‌ఏ పీఓ దశరథరామయ్య, ఆర్డీటీ స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ డైరెక్టర్‌ నిర్మల్‌ కుమార్‌ హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆర్డీటీ సంస్థ క్రీడలపై చూపుతున్న శ్రద్ధ ఎనలేనిదన్నారు. ఆర్డీటీ సంస్థ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ మాంఛో ఫెర్రర్‌ కృషి అభినందనీయమన్నారు. అనంతరం జిల్లా సాఫ్ట్‌బాల్‌ కార్యదర్శి వెంకటేశులు మాట్లాడుతూ సాఫ్ట్‌బాల్‌ ఎంపికకు జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు హాజరయ్యారన్నారు.

ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు చెప్పారు. వీరు గుంటూరు జిల్లా మాచర్లలో సెప్టెంబర్‌ 10 నుంచి 12 వరకూ జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. జిల్లా స్కూల్‌గేమ్స్‌ కార్యదర్శి నారాయణ, పీఈటీ సంఘం అధ్యక్షులు లింగమయ్య, కార్యదర్శి ప్రభాకర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు రామకృష్ణ సత్యనారాయణ, కోశాధికారి ఆంజనేయులు, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement