breaking news
softball team
-
సాఫ్ట్‌గా దూసుకెళుతున్నారు!
సాఫ్ట్‌బాల్‌లో ప్రతిభ చూపుతున్న తూర్పు కిరణాలు జాతీయ స్థాయికి పలువురి క్రీడాకారులు సాఫ్ట్‌బాల్‌లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. గడిచిన రెండేళ్ల కాలంలో జిల్లా నుంచి పలువురు క్రీడాకారులు జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడమే దీనికి నిదర్శనం. ప్రభుత్వం మరిన్ని సదుపాయాలు కల్పిస్తే తమ సత్తా చాటుతామని వారంటున్నారు. – రావులపాలెం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే జిల్లాస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు రావులపాలెం తదితర ప్రాంతాల విద్యార్థులు హాజరై జిల్లా జట్లకు ఎంపికయ్యారు. ఇప్పటికే జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు కూడా జిల్లా జట్లలో ఉన్నారు. ఈ విధంగా అండర్–14, అండర్–17 బాలబాలికల విభాగాల్లో 64 మందికి ఈ నెల 15వ తేదీ నుంచి రావులపాలెం జెడ్పీబాలుర హైస్కూల్ మైదానంలో ఎస్జీఎఫ్ జిల్లా జాయింట్ సెక్రటరీ, జాతీయ కోచ్ బండారు ప్రసాద్ పర్యవేక్షణలో శిక్షణ శిబిరం జరుగుతోంది. గతేడాది రాష్ట్ర జట్లకు ఎంపికై జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు ఈ శిక్షణ శిబిరంలో పాల్గొంటున్నారు. నేషనల్స్ ఆడాను స్కూల్ గేమ్స్‌లో భాగంగా 2014–15లో అండర్–14 బాలుర విభాగంలో రాష్ట్ర జట్టుకు ఎంపికై మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన నేషనల్స్ ఆడాను. అలాగే అనంతపురంలో 2014–15, 2015–16లో జరిగిన స్కూల్ గేమ్స్ రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో జిల్లా తరఫున ఆడాను. ఈ ఏడాది కూడా జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నా. టీమ్‌లో క్యాచర్‌గా వ్యవహరిస్తాను. ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరింతగా రాణిస్తాం. – డి.గంగరాజు, పగడాలపేట సొంత ఖర్చులతోనే పోటీలకు.. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనా సొంత ఖర్చులు, దాతల సహకారంతో పోటీలకు వెళ్లాల్సి వస్తుంది. నిరుపేద కుటుంబంలో పుట్టినా ఈ క్రీడపై ఆసక్తితో ముందుకు సాగుతున్నా. గతేడాది దిల్లీలో జరిగిన నేషనల్స్‌లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించాను. సాఫ్ట్‌బాల్ క్రీడలో రాణిస్తే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండడంతో ప్రోత్సాహం లేకపోయినా కష్టపడి పోటీలకు హాజరవుతున్నా. – పి.రూతు, దేవరపల్లి సాప్్టబాల్ సామగ్రికి ఖర్చు ఎక్కువ సాఫ్ట్‌బాల్ క్రీడకు సంబంధించిన సామగ్రి ఖర్చు ఎక్కువ. జట్టుకు కావాల్సిన కిట్టు కొనుగోలు చేయాలంటే రూ.లక్ష వెచ్చించాలి. స్లగ్గర్ ధర రూ.ఐదు వేల నుంచి∙రూ.35 వేల వరకూ ఉంది. జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీలకు కనీసం రూ.15 వేల స్లగ్గర్ అయినా ఉండాలి. అలాగే హె ల్మెట్ ధర రూ.రెండు వేలు, చెస్ట్మాస్క్ ధర రూ.1800, ప్యాడ్లు ధర రూ.2400, బాల్ ధర రూ.500, గ్లౌజ్ రూ.2400 వరకూ ఉంటాయి. ప్రభుత్వం క్రీడా సామగ్రి సమకూరిస్తే క్రీడాకారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. – బండారు ప్రసాద్, కోచ్, ఎస్జీఎఫ్ జాయింట్ సెక్రటరీ పిచ్చింగ్, క్యాచింగ్ ముఖ్యం సాఫ్ట్‌బాల్ క్రీడలో విజయం సాధించాలంటే క్రీడాకారులు పిచ్చింగ్, క్యాచింగ్లలో ప్రావీణ్యం కనబర్చాలి. ఈ రెండు అంశాల్లో ఏ జట్టు ముందు ఉంటే వారిదే విజయం. ఈ అంశాల్లో ముమ్మర సాధన చేస్తున్నాం. గతేడాది దిల్లీలో జరిగిన నేషనల్స్‌లో అండర్–14 బాలికల విభాగంలో రాష్ట్ర జట్టు తరఫున ఆడాను. మన జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. ప్రసుత్తం అనంతపురం జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జట్టు తరఫున శిక్షణ పొందుతున్నా. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు వెళ్లే క్రీడాకారులకు ఆర్టీసీ, రైల్వే రాయితీలు కల్పిస్తే బాగుంటుంది. – కె.దేవి, జి.వేమవరం సాఫ్ట్‌బాల్‌కు ప్రభుత్వం ప్రోత్సాహాన్ని ఇవ్వాలి ప్రభుత్వం సాఫ్ట్‌బాల్ క్రీడాకారులకు క్రీడా సామగ్రి అందజేయాలి. 2015–16లో దిల్లీలో జరిగిన స్కూల్ గేమ్స్ నేషనల్స్ సాఫ్ట్‌బాల్ పోటీల్లో రాష్ట్ర జట్టు తరఫున ఆడాను. అండర్–14 బాలుర విభాగంలో పాల్గొన్నా. పాuý శాలల్లో సాఫ్ట్‌బాల్ క్రీడా సామగ్రిని ప్రభుత్వం అందుబాటులో ఉంచితే శిక్షణకు ఎంతగానో ఉపకరిస్తుంది. – కె.శ్యామ్‌ప్రసాద్, పగడాలపేట -
సాఫ్ట్‌బాల్ జట్ల ఎంపిక
అనంతపురం సప్తగిరిసర్కిల్ : జిల్లా సాఫ్ట్‌బాల్ జిల్లా జట్ల ఎంపిక అనంత క్రీడాగ్రామంలో మంగళవారం జరిగింది. జిల్లా విద్యాశాఖాధికారి అంజయ్య, ఎస్ఎస్ఏ పీఓ దశరథరామయ్య, ఆర్డీటీ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ డైరెక్టర్ నిర్మల్ కుమార్ హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆర్డీటీ సంస్థ క్రీడలపై చూపుతున్న శ్రద్ధ ఎనలేనిదన్నారు. ఆర్డీటీ సంస్థ ప్రోగ్రామ్ డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ కృషి అభినందనీయమన్నారు. అనంతరం జిల్లా సాఫ్ట్‌బాల్ కార్యదర్శి వెంకటేశులు మాట్లాడుతూ సాఫ్ట్‌బాల్ ఎంపికకు జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు హాజరయ్యారన్నారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు చెప్పారు. వీరు గుంటూరు జిల్లా మాచర్లలో సెప్టెంబర్ 10 నుంచి 12 వరకూ జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. జిల్లా స్కూల్‌గేమ్స్ కార్యదర్శి నారాయణ, పీఈటీ సంఘం అధ్యక్షులు లింగమయ్య, కార్యదర్శి ప్రభాకర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు రామకృష్ణ సత్యనారాయణ, కోశాధికారి ఆంజనేయులు, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.