యారాడలో షూటింగ్‌ సందడి | shooting in yarada | Sakshi
Sakshi News home page

యారాడలో షూటింగ్‌ సందడి

Jul 17 2016 9:20 PM | Updated on Sep 4 2017 5:07 AM

యారాడలో షూటింగ్‌ సందడి

యారాడలో షూటింగ్‌ సందడి

ఎస్‌.వీ.ఎస్‌ క్రియేషన్స్‌ వారి ప్రొడక్షన్‌ నంబర్‌–1 చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ ఆదివారం యారాడ బీచ్‌లో జరిగింది.

మల్కాపురం : ఎస్‌.వీ.ఎస్‌ క్రియేషన్స్‌ వారి ప్రొడక్షన్‌ నంబర్‌–1 చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ ఆదివారం యారాడ బీచ్‌లో జరిగింది. ఈ చిత్రంలో ప్రముఖ నటి,దర్శుకురాలు విజయనిర్మల మనవడు,హీరో నరేష్‌ తనయుడు నవీన్‌ హీరోగాlనటిస్తున్నాడు. నటి శ్రావ్య, నవీన్‌ మధ్య ప్రేమ సన్నివేశాలను ఆదివారం చిత్రీకరించారు. ఈ చిత్రంలో నటిస్తున్న హీరో నవీన్‌ తనకు ఇది రెండో చిత్రమని,తొలి సినిమా  విడుదల కావల్సి ఉందన్నారు. తన తండ్రిలా చిత్రరంగంలో మంచి పేరుతెచ్చుకొంటానన్నారు. యారాడ బీచ్‌ ఎంతో సుందరంగా ఉందన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement