తాగునీటికోసం ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా | SFI protest for drinking water | Sakshi
Sakshi News home page

తాగునీటికోసం ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా

Feb 14 2017 10:11 PM | Updated on Sep 5 2017 3:43 AM

తాగునీటికోసం ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా

తాగునీటికోసం ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా

ఓదెల మండలం కొలనూర్‌ జిల్లా పరిషత్‌ పాఠశాలలో మంచినీటి ఎద్దడిని నివారించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు.

ఓదెల : ఓదెల మండలం కొలనూర్‌ జిల్లా పరిషత్‌ పాఠశాలలో మంచినీటి ఎద్దడిని నివారించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. పాఠశాల ప్రధాన గేట్‌ వద్ద సుమారు గంటపాటు మంచినీటి ఎద్దడిని నివారించండి, విధ్యార్థుల సమస్యలు పరిష్కరించాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు.

ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి సతీష్‌గౌడ్‌ , ఎస్‌ఎఫ్‌ఐ మండలశాఖ అధ్యక్షుడు పల్కల సుగుణాకర్‌రెడ్డి, కార్యదర్శి మార్క సతీష్‌గౌడ్, విధ్యార్థులు రాజు, నరేశ్, ఓంకార్, సాయి, చరణ్, శివసాయి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement