నేత్రపర్వం | seven saturdays festival in anantapur | Sakshi
Sakshi News home page

నేత్రపర్వం

Jul 30 2016 11:30 PM | Updated on Oct 1 2018 6:33 PM

నేత్రపర్వం - Sakshi

నేత్రపర్వం

ఆషాఢమాసం చివరి శనివారం సందర్భంగా స్థానిక ఆర్‌ఎఫ్‌ రోడ్‌లోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఏడు శనివారాల వ్రతం కనుల పండువగా జరిగింది.

అనంతపురం కల్చరల్‌ : ఆషాఢమాసం చివరి శనివారం సందర్భంగా స్థానిక ఆర్‌ఎఫ్‌ రోడ్‌లోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఏడు శనివారాల వ్రతం కనుల పండువగా జరిగింది. శనివారం మహిళా భక్తులు ఏకరూప వస్త్రధారణతో వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఏఎల్‌ఎన్‌ శాస్త్రి, హరికిశోర్‌ శర్మ నేతృత్వంలో భక్తుల గోవింద నామస్మరణతో ఆప్రాంతం మార్మోగింది. భక్తులు బారులుదీరి వేంకటేశ్వర స్వామి ప్రతిమకు ప్రత్యేక పసుపు, కుంకుమలతో, పవిత్ర జలాలు, పుష్పాలతో పూజలు నిర్వహించారు.

అనంతరం మధ్యాహ్నం అన్నదానం నిర్వహించారు. ఆలయంలోని శ్రీ లక్ష్మీ సహిత శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రత్యేక అలంకరించారు. సుప్రభాత సేవ, అభిషేకాలు, తిరుమంజనం,తోమాల సేవ. కుంకుమార్చన. తీర్థప్రసాద వినియోగం జరిగాయి. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement