ప్రారంభోత్సవం ముచ్చట మూడోసారి ! | school opening third time chandramampalli | Sakshi
Sakshi News home page

ప్రారంభోత్సవం ముచ్చట మూడోసారి !

Sep 4 2016 11:18 PM | Updated on Sep 15 2018 4:12 PM

ప్రారంభోత్సవం ముచ్చట మూడోసారి ! - Sakshi

ప్రారంభోత్సవం ముచ్చట మూడోసారి !

గతంలో రెండుసార్లు ప్రారంభించిన పాఠశాలనే డిప్యూటీ సీఎం, రెవెన్యూమంత్రి కేఈ కృష్ణమూర్తి మళ్లీ ప్రారంభించడం విడ్డూరంగా ఉందని జనం

పెద్దాపురం : గతంలో రెండుసార్లు ప్రారంభించిన పాఠశాలనే డిప్యూటీ సీఎం, రెవెన్యూమంత్రి కేఈ కృష్ణమూర్తి మళ్లీ ప్రారంభించడం విడ్డూరంగా ఉందని జనం అనుకుంటున్నారు. పెద్దాపురం మండలం చంద్రమాంపల్లి హైస్కూల్‌కు 2012లో ఏప్రిల్‌ 8న అప్పటి ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్‌ సుమారు 70 లక్షల సర్వశిక్షాభియాన్‌ నిధులతో భూమిపూజ చేశారు. ఎన్నికల కోడ్‌ దగ్గర పడుతున్న నేపథ్యంలో 20 శాతం పనులు మిగిలి ఉండగానే గాంధీమోహన్‌ 2014 ఫిబ్రవరి 22న ప్రారంభోత్సవం చేశారు. అప్పటి నుంచి నిధుల విడుదలలో జాప్యం జరిగింది. ఉప ముఖ్యమంత్రి చిన రాజప్ప గత ఏడాది మేలో పాఠశాల ప్రారంభోత్సవానికి కొబ్బరికాయ కొట్టారు. దానికే ముచ్చటగా మూడోసారి ఆదివారం కృష్ణమూర్తి ప్రారంభోత్సవం చేశారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement