స్కాలర్‌షిప్‌ దరఖాస్తుకు 31వరకు గడువు | scholarship application extension to 31st | Sakshi
Sakshi News home page

స్కాలర్‌షిప్‌ దరఖాస్తుకు 31వరకు గడువు

Oct 2 2016 12:28 AM | Updated on Aug 20 2018 3:09 PM

స్కాలర్‌షిప్‌ దరఖాస్తుకు ఈ నెల 31 వరకు గడువు పొడిగించినట్లు మైనార్టీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ జమీర్‌ అహమ్మద్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

అనంతపురం సప్తగిరి సర్కిల్ః స్కాలర్‌షిప్‌ దరఖాస్తుకు ఈ నెల 31 వరకు గడువు పొడిగించినట్లు మైనార్టీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ జమీర్‌ అహమ్మద్‌ ఓ ప్రకటనలో తెలిపారు. భారత ప్రభుత్వం అందిస్తున్న ప్రీమెట్రీక్, పోస్ట్‌మెట్రీక్‌ స్కాలర్‌షిప్‌ కొరకు 1వ తరగతి నుంచి 10వ తరగతి చదువుచున్న మైనార్టీ విద్యార్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు.

అప్‌లోడ్‌ చేసిన దరఖాస్తులను పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందించాలన్నారు. ప్రధానోపాధ్యాయులు తమ యూజర్‌ఐడీ ద్వారా ఆన్‌లైన్‌ లో పరిశీలించి జిల్లా అధికారికి ఫార్వర్డ్‌ చేయాలన్నారు. ఇతర వివరాలకు 08554–246615 నంబర్‌లో సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement