కోడిపందేలు వద్దన్నందుకు.. కడతేర్చారు | satyavani, kerosine, cock fights, సత్యవాణి, కిరోసిన్‌, కోడిపందేలు | Sakshi
Sakshi News home page

కోడిపందేలు వద్దన్నందుకు.. కడతేర్చారు

Mar 27 2016 3:36 PM | Updated on Sep 3 2017 8:41 PM

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పట్టింపాలెంలో ఓ వివాహితపై భర్త, అత్తలు కలసి పెట్రోల్ పోసి నిప్పంటించారు.

తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పట్టింపాలెంలో ఓ వివాహితపై భర్త, అత్తలు కలసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్ర కాలిన గాయాలతో ఆమె మృతి చెందింది. పోలీసుల కథనం మేరకు... పట్టింపాలెం గ్రామానికి చెందిన సత్యవాణి (24)కి ఐదేళ్ల బాబు, ఎనిమిది నెలల పాప ఉన్నారు.

భర్త తరచూ కోడిపందేలు ఆడుతూ ఉండడంతో ఈ విషయమై వారిద్దరి మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి సమయంలోనూ గొడవ జరిగింది. దీంతో భర్త, అత్తలు సత్యవాణిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో ఆమె తీవ్ర కాలిన గాయాలతో మృతి చెందింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement