ముగిసిన సప్తాహ మహోత్సవాలు | saptaha mahostavalu complete | Sakshi
Sakshi News home page

ముగిసిన సప్తాహ మహోత్సవాలు

Nov 9 2016 11:19 PM | Updated on Sep 4 2017 7:39 PM

జంగారెడ్డిగూడెం రూరల్‌ : జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం శ్రీమద్ది ఆంజనేయస్వామి ఆలయంలో కార్తీక మహోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న సప్తాహ మహోత్సవాలు బుధవారంతో ఘనంగా ముగిశాయి.

జంగారెడ్డిగూడెం రూరల్‌ : జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం శ్రీమద్ది ఆంజనేయస్వామి ఆలయంలో కార్తీక మహోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న సప్తాహ మహోత్సవాలు బుధవారంతో ఘనంగా ముగిశాయి.  కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రధానార్చకులు వేదాంతం వెంకటాచార్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్‌  ఇందుకూరి రంగరాజు, లీలారాణి దంపతులచే ఆలయ అర్చకులు, వేద పండితులు సప్తాహ మహోత్సవ ముగింపుల పూజలు,  మహా శాంతి హోమం పూజలు జరిపించారు. స్వామి వారి ఉత్సవ మూర్తులను ఆలయం చుట్టూ  ఊరేగించారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. 2 వేల మంది భక్తులకు అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. భజన మండలి సభ్యులను ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు సత్కరించారు. ఈవో పెన్మెత్స విశ్వనాథరాజు పాల్గొన్నారు.   
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement