అప్పుల బాధతో రైతు ఆత్మహత్య | Sad debt farmer suicide | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Feb 26 2017 1:20 AM | Updated on Sep 5 2017 4:35 AM

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు యత్నించిన మండల పరిధిలోని రాజువారిపేట గ్రామానికి చెందిన పాలూరు వెంకటరెడ్డి (55) అనే రైతు మృతి చెందాడు.

రాజువారిపేట(చాపాడు): అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు యత్నించిన మండల పరిధిలోని రాజువారిపేట గ్రామానికి చెందిన పాలూరు వెంకటరెడ్డి (55) అనే రైతు  మృతి చెందాడు. పోలీసులు, మృతుని బంధువుల కథనం మేరకు.. గత ఐదారేళ్లుగా వెంకటరెడ్డి 9 ఎకరాల కౌలు పొలంలో వ్యవసాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో తనకు వ్యవసాయం, కుటుంబ పోషణ కోసం రూ. 8లక్షలు పైగా అప్పులు అయ్యాయి. ఈ ఏడాది సాగు చేసిన చెరకు పంట సైతం అనుకున్నంత దిగుబడి ఇవ్వకపోవటంతో మనస్తాపం చెందిన రైతు ఈ నెల 20న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శివశంకర్‌ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement