తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు | Summer Vacations Extended For Schools In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు

Jun 7 2026 1:19 PM | Updated on Jun 7 2026 2:20 PM

Summer Vacations Extended For Schools In Telangana

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 14వ తేదీ వరకు సెలవులను విద్యాశాఖ పొడిగించింది. ఈ నెల 15న పాఠశాలల పునఃప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో పాఠశాలలకు వేసవి సెలవులను ప్రభుత్వం పొడిగించింది.

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇంకా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. సెలవులను పొడిగించడం వల్ల విద్యార్థులు తీవ్రమైన వేసవి ఎండల బారిన పడకూడదని అధికారులు  ఈ నిర్ణయం తీసకున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమవడానికి ముందు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని యాజమాన్యాలకు ప్రభుత్వం సూచించింది.

 

Advertisement
 
Advertisement
Advertisement