ఆర్టీసీ బస్సు, స్కార్పియో ఢీ | rtc bus, scarpio, accident | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు, స్కార్పియో ఢీ

Jul 28 2016 10:33 PM | Updated on Apr 3 2019 7:53 PM

ప్రమాదంలో నుజ్జు నుజై్జన స్కార్పియో వాహనం - Sakshi

ప్రమాదంలో నుజ్జు నుజై్జన స్కార్పియో వాహనం

ఆర్టీసీ బస్సు, స్పార్పియో ఢీకొనడంతో మహిళ మృతి చెందింది.

– మహిళ మృతి
– నలుగురికి తీవ్ర గాయాలు
–నుజ్జునుజ్జు అయిన స్కార్పియో

కల్లూరు : ఆర్టీసీ బస్సు, స్పార్పియో ఢీకొనడంతో మహిళ మృతి చెందింది. మరో నలుగరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన పులిచెర్ల మండలం కల్లూరు ఘాట్‌ రోడ్డులో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... వైఎస్సార్‌ కడప జిల్లా సుండుపల్లె మండలం రెడ్డివారిపల్లెకు చెందిన నారప్ప భార్య కోనేటి వెంకటమ్మ (50), వారి మేనళ్లుడు మేకల చంటి (24) కొన్నేళ్లుగా కువైట్‌లో ఉంటున్నారు. వారు గురువారం చెన్నై ఎయిర్‌పోర్టుకు వచ్చారు. వారిని ఇంటికి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు స్కార్పియోలో చెన్నై వెళ్లారు. తిరిగి వస్తుండగా కల్లూరు ఘాట్‌ రోడ్డులో వైఎస్సార్‌ కడప జిల్లా ప్రొద్దుటూరు డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు  ఢీకొంది. ఈ ప్రమాదంలో స్కార్పియోలో ఉన్న కోనేటి వెంకటమ్మ అక్కడికక్కడే మృతి చెందింది.
రెడ్డివారిపల్లెకు చెందిన మేకల చంటి, మేకల వెంకట్రమణ (45), మేకల లక్ష్మిదేవి (40), డ్రైవర్‌ షేక్‌ మాబు (45) తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని 108 వాహనంలో పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు రెఫర్‌ చేశారు. ఈ ప్రమాదంలో స్కార్పియో వాహనం నుజ్జునుజ్జు అయింది. వెంకటమ్మ మృతదేహాన్ని పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బతుకుదెరువు కోసం కువైట్‌ వెళ్లిన వెంకటమ్మ సంతోషంగా స్వగ్రామానికి వస్తూ మార్గమధ్యంలో మృతిచెందడతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. కల్లూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement