వీరవాసరం : జాతీయ రహదారిపై వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తూ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. బుధవారం జరిగిన ఈ ఘటనలో పలువురు స్వల్పంగా గాయపడ్డారు.
చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు
Sep 7 2016 11:25 PM | Updated on Apr 7 2019 3:24 PM
వీరవాసరం : జాతీయ రహదారిపై వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తూ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. బుధవారం జరిగిన ఈ ఘటనలో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. పాలకొల్లు నుంచి భీమవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు జాతీయ రహదారిపై వీరవాసరం గొంతేరు డ్రెయిన్‌పై ప్రమాదవశాత్తు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న చెట్టును డీకొట్టింది. డ్రైవర్ దినేష్ అనారోగ్యంతో ఉన్నాడని, అలాగే బస్సును నడుపుకుంటూ వచ్చాడని, వీరవాసరం సమీపంలోకి వచ్చే సరికి కళ్లు తిరిగి స్టీరింగ్ మీద పడిపోవడంతో బస్సు రహదారి పక్కగా ఉన్న షెడ్డును ఢీకొని ఎదురుగా ఉన్న చెట్టునుఢీకొట్టి ఆగిపోయిందని ప్రయాణికులు చెప్పారు. ఆ సమయంలో బస్సులో 64 మంది ప్రయాణిస్తుండగా, ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. నిత్యం రద్దీగా ఉండే బ్రాందీ షాపు ఎదుట ఉదయంపూట కావడంతో జనాలు ఎవరూ లేరు. లేకుంటే పెను ప్రమాదం జరిగేదని స్థానికులు ఆందోళన వ్యక్తంచేశారు. ఘటనా ప్రాంతాన్ని ఆర్టీసీ భీమవరం డిపో మేనేజర్ గిరిధర్ కుమార్ పరిశీలించారు.
Advertisement
Advertisement