వాట్సాప్‌లో ఐదువేల నోటు హల్‌చల్! | Rs 5,000 Denomination Note in whatpp | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌లో ఐదువేల నోటు హల్‌చల్!

Feb 4 2016 9:04 PM | Updated on Sep 3 2017 4:57 PM

వాట్సాప్‌లో ఐదువేల నోటు హల్‌చల్!

వాట్సాప్‌లో ఐదువేల నోటు హల్‌చల్!

ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌లో ఐదువేల రూపాయల నోటు ఇదేనంటూ ఓ ఫొటో హల్‌చల్ చేస్తోంది.

మెదక్: ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌లో ఐదువేల రూపాయల నోటు ఇదేనంటూ ఓ ఫొటో హల్‌చల్ చేస్తోంది. త్వరలో భారత రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ఈ నోటును మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు పేర్కొంటూ.. దీనిని ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఐదువేల నోటు వాట్సాప్ లో విపరీతంగా షేర్ అవుతోంది. గతంలో రూ.500 నోటు రావడమే ప్రజలు గొప్పగా భావించారు.

ఆ తరువాత రూ.1,000 నోటు వచ్చి వారిని మరింత ఆశ్చర్యపరిచింది. ఈసారి ఏకంగా రూ.5,000 నోటు వస్తుందని వాట్సాప్‌లో ప్రచారం జరుగడం చర్చనీయాంశంగా మారింది. వాట్సాప్‌లోనే కాదు ఫేస్‌బుక్‌లోనూ ఈ ఐదువేల నోటు ఫొటో హల్‌చల్ చేస్తోంది. అయితే గతంలో 2014లోనూ ఓసారి ఇలాగే రూ. ఐదువేల నోటు వస్తుందని విపరీతంగా ప్రచారం జరిగింది. దీనిని ఆర్బీఐ అప్పట్లో కొట్టిపారేసింది. ఐదువేల నోటు వస్తుందన్నదని ప్రచారం బూటకమేనని అప్పట్లో స్పష్టం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement