వరంగల్ జిల్లా వర్థన్నపేట మండలం పాతిని గ్రామంలోని కోమల్ వైన్స్‌లో బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగింది.
వరంగల్ : వరంగల్ జిల్లా వర్థన్నపేట మండలం పాతిని గ్రామంలోని కోమల్ వైన్స్‌లో బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. దుండగలు తాళాలు పగలగొట్టి షాపులో ఉన్న రూ. 4.5 లక్షల విలువైన మద్యం సీసాలను ఎత్తుకెళ్లారు. గురువారం ఉదయం షాపు యజమాని ఆ విషయాన్ని గుర్తించి పోలీసులను ఆశ్రయించి... ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.