ఇల్లందు-గుండాల దారిలో ఆగిన రాకపోకలు | Road damaged by flood water | Sakshi
Sakshi News home page

ఇల్లందు-గుండాల దారిలో ఆగిన రాకపోకలు

Sep 27 2016 5:35 PM | Updated on Aug 1 2018 4:01 PM

ఖమ్మం జిల్లా ఇల్లందు-గుండాల మార్గంలో మంగళవారం మధ్యాహ్నం నుంచి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

ఖమ్మం: ఖమ్మం జిల్లా ఇల్లందు-గుండాల మార్గంలో మంగళవారం మధ్యాహ్నం నుంచి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. బాటన్ననగర్ వద్ద ఉన్న వాగులో వరద ఉధృతికి అప్రోచ్ రోడ్డు తెగిపోయింది. దీంతో రెండు వైపులా వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. అధికారులు జేసీబీని తెప్పించి అప్రోచ్ రోడ్డును సరిచేసేందుకు యత్నిస్తున్నారు. సాయంత్రం వరకు ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement