కొల్లేరులో అటవీ సిబ్బందిపై దాడి.. | Road construction workers attacked on Forest staff | Sakshi
Sakshi News home page

కొల్లేరులో అటవీ సిబ్బందిపై దాడి..

May 28 2016 7:58 PM | Updated on Oct 4 2018 6:03 PM

కృష్ణాజిల్లాలోని కొల్లేరులో శనివారం అటవీ సిబ్బందిపై దాడి జరిగింది.

కృష్ణా: కృష్ణాజిల్లాలోని కొల్లేరులో శనివారం అటవీ సిబ్బందిపై దాడి జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు, కృష్ణాజిల్లా మండవల్లి మండలం చింతపాడు నుంచి యగనమిల్లి మీదుగా రోడ్డు నిర్మాణం చేపట్టారు. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది రోడ్డు నిర్మాణానికి అడ్డుకునేందుకు కొల్లేరు వెళ్లింది.

ఈ నేపథ్యంలో అటవీ సిబ్బందిపై కొందరు దాడికి పాల్పడ్డారు. దీంతో అటవీశాఖ సిబ్బంది ఆందోళనకు దిగారు. కాగా, ఈ రోడ్డు నిర్మాణానికి  అధికార పార్టీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ చింతమనేని ప్రభాకర్ మద్దతు ఉన్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement