రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి | Road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

Jan 29 2017 11:21 PM | Updated on Aug 30 2018 4:10 PM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి - Sakshi

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

మండలంలోని కేశవరంలో ఆదివారం కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన ఘటనలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా, మరో యువకుడు రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. తీవ్ర గాయాలతో ముగ్గురు యువకులు ఆస్పత్రిలో చికిత్స

  • మరో ముగ్గురికి గాయాలు
  • స్నేహితుని వివాహానికి వెళ్లి వస్తుండగా ఘటన
  • సహాయక చర్యలు నిర్వహించిన వైఎస్సార్‌ సీపీ మండపేట కోఆర్డినేటర్‌ లీలాకృష్ణ
  • కేశవరం (మండపేట)/ రాజమహేంద్రవరం క్రైం : 
    మండలంలోని కేశవరంలో ఆదివారం కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన ఘటనలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా, మరో యువకుడు రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. తీవ్ర గాయాలతో ముగ్గురు యువకులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మితిమీరిన వేగం ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాద సమయానికి అటుగా వస్తున్న వైఎస్సార్‌ సీపీ మండపేట నియోజకవర్గ కోఆర్డినేటర్‌ వేగుళ్ల లీలాకృష్ణ హుటాహుటిన సహాయక చర్యలు నిర్వహించి క్షతగాత్రులను 108లో ఆస్పత్రికి పంపించారు. 
    రాయవరం మండలం చెల్లూరుకు చెందిన మేడిశెట్టి శ్రీకాంత్‌ (22), రామచంద్రపురం రూరల్‌ ద్రాక్షారామకు  చెందిన చెల్లూరి విజయ్‌ (25) , రామచంద్రపురం రూరల్‌ జగన్నాయకులపాలేనికి చెందిన బొండారి ఆంజనేయులు, ఏరుపల్లికి చెందిన జట్టు సతీష్‌ టైల్స్‌ కార్మికులుగా పనిచేస్తున్నారు. రాజమండ్రిలో స్నేహితుడి వివాహ వేడుకలో పాల్గొనేందుకు కారులో బయలుదేరి వెళ్లారు. సాయంత్రం తిరుగుప్రయాణంలో కేశవరంలోని గనిపోతురాజు స్వామి ఆలయ సమీపంలో కారు అదుపుతప్పి రోడ్డుపక్క మైలురాయిని ఢీకొట్టి సమీపంలో ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీకాంత్‌ అక్కడికక్కడే మృతిచెందగా, విజయ్, ఆంజనేయులు, సతీష్‌లతో పాటు డ్రైవర్‌ రామచంద్రపురానికి చెందిన అనిశెట్టి శేషుకు గాయాలయ్యాయి. మధురపూడి విమానాశ్రయంలో వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగ¯ŒSమోహ¯ŒSరెడ్డిని కలసి తిరిగిస్తున్న లీలాకృష్ణ, పార్టీ యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దూలం వెంకన్నబాబు, పార్టీ నాయకులు ప్రమాదాన్ని చూసి 108కి సమాచారం అందించారు. రూరల్‌ పోలీసులు, క్షతగాత్రుల కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. 108 అంబులె¯Œ్సలో వారిని రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చెల్లూరి విజయ్‌ మృతిచెందాడు. రూరల్‌ ఎస్‌ఐ సీహెచ్‌ విద్యాసాగర్‌ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
    చెల్లూరు(రాయవరం): చేతికందివస్తున్నాడనుకున్న సమయంలోనే కుమారుడ్ని తీసుకు పోయావా..మాపై నీకెందుకింత కక్ష అంటూ శ్రీకాంత్‌ తల్లిదండ్రులు బోరున విలపించారు. మండపేట మండలం కేశవరం వద్ద జరిగిన ప్రమాదంలో మేడిశెట్టి శ్రీకాంత్‌ మృతిచెందడంతో అతని తల్లిదండ్రులు వీరవెంకటసత్యనారాయణ (వీర్రాజు), నాగమణిల వేదన వర్ణణాతీతంగా ఉంది. శ్రీకాంత్‌ టైల్స్‌ పని చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. శ్రీకాంత్‌ అన్నయ్య ప్రసాద్‌ జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కూలిపని చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే శ్రీకాంత్‌ తల్లిదండ్రులు పెద్ద కుమారుడికి వివాహం చేద్దామనుకుంటున్న తరుణంలో శ్రీకాంత్‌ మరణంతో వారు హతాశులయ్యారు. స్నేహితులతో కలిసి పెళ్లికి వెళ్లి ఇంటికి వస్తాడనుకుంటుండగా కుమారుడి మరణవార్త తెలియడంతో తల్లిదండ్రులు భోరున విలపించారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే ఎంపీటీసీ పాలిక రాఘవగోవిందు సంఘటనా స్థలికి వెళ్లి, తల్లిదండ్రులను ఓదార్చారు.
     

Advertisement
 
Advertisement
Advertisement