స.హ. చట్టానికి ప్రచారం అవసరం | right to information act need publicity | Sakshi
Sakshi News home page

స.హ. చట్టానికి ప్రచారం అవసరం

Sep 23 2016 11:27 PM | Updated on Sep 4 2017 2:40 PM

సమాచార హక్కు చట్టానికి ప్రచారం లేకపోవడం వల్లే చట్టం నీరుకారిపోతుందని సమాచార హక్కు చట్టం కమిషనర్‌ తాంతియా కుమారి అన్నారు. స్థానిక ఇరిగేషన్‌ అతిథిగృహంలో శుక్రవారం ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స.హ. చట్టం ప్రజల్లోకి సరైన రీతిలో వెళ్లని కారణంగా చట్టాన్ని ప్రజలు ఉపయోగించుకోలేకపోతున్నారన్నారు.

ఏలూరు (మెట్రో) : సమాచార హక్కు చట్టానికి ప్రచారం లేకపోవడం వల్లే చట్టం నీరుకారిపోతుందని సమాచార హక్కు చట్టం కమిషనర్‌ తాంతియా కుమారి అన్నారు. స్థానిక ఇరిగేషన్‌ అతిథిగృహంలో శుక్రవారం ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స.హ. చట్టం ప్రజల్లోకి సరైన రీతిలో వెళ్లని కారణంగా చట్టాన్ని ప్రజలు ఉపయోగించుకోలేకపోతున్నారన్నారు. చట్టానికి సరైన స్థాయిలో ప్రచారం కల్పించాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపై ఉందన్నారు. స.హ.æచట్టం ద్వారా ప్రశ్నించే వారిపై దాడులు సైతం జరుగుతున్నాయని, అటువంటి వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. దాడుల నిర్మూలనకు తక్షణమే కమిటీలు కూడా వేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement