ఏలూరు: లింగపాలెం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. జూబ్లీనగర్ దగ్గర భారతి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో పదిమంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో 20మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఘటన జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఏలూరు నుంచి చింతలపూడి మీదిగా హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
జెసిబి సహాయంతో బోల్తా పడ్డ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును బయటికి తీసిన అధికారులు. బస్సు బోల్తా పడిన సమయంలో బస్సుకింద పడి చనిపోయిన ప్రవీణ్ బాబు అనే యువకుడు. లింగాపాలెం మండలం అయ్యపురాజుగూడెం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు. ప్రవీణ్ హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఎంప్లాయిగా పనిచేస్తున్నట్టు సమాచారం.


