అనంతపురం జిల్లాలోని ధర్మవరం రైల్వేస్టేషన్‌లో ఆదివారం దారుణం చోటుచేసుకుంది.
ధర్మవరం: అనంతపురం జిల్లాలోని ధర్మవరం రైల్వేస్టేషన్‌లో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తి.. ధర్మవరం పట్టణం కొత్తపేటకు చెందిన రైల్వే రిటైర్డ్ ఉద్యోగి నారాయణస్వామి(56)గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.