కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించాలి | regularised contract lecturers | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించాలి

Sep 5 2016 1:30 AM | Updated on Sep 4 2017 12:18 PM

కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణను వెంటనే చేపట్టాలని తెలంగాణ కాంట్రాక్టు లెక్చరర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కనక చంద్రం డిమాండ్‌ చేశారు.

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం: కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణను వెంటనే చేపట్టాలని తెలంగాణ కాంట్రాక్టు లెక్చరర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కనక చంద్రం డిమాండ్‌ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బాలికల జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రమదోపిడీ, వెట్టిచాకిరీ, బానిసత్వాలకు మరో రూపం కాంట్రాక్టు వ్యవస్థ అని అన్నారు. అలాంటి కాంట్రాక్టు వ్యవస్థను రూపుమాపడానికి కేసీఆర్‌ జీఓ 22ను, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు జీఓ నెం.16ను విడుదల చేసినప్పటికీ రెగ్యులరైజేషన్‌ ప్రక్రియ నత్తనడకన కొనసాగుతుందన్నారు. వెంటనే క్రమబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, నర్సింహ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్వర్‌రావు, వెంకట్రాములు, జమ్మన్న, శ్రీధర్‌బాబు, పి.రామచంద్రారెడ్డి, ఆనంతరెడ్డి, సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement