breaking news
Kanaka Chandram
-
కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించాలి
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణను వెంటనే చేపట్టాలని తెలంగాణ కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కనక చంద్రం డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రమదోపిడీ, వెట్టిచాకిరీ, బానిసత్వాలకు మరో రూపం కాంట్రాక్టు వ్యవస్థ అని అన్నారు. అలాంటి కాంట్రాక్టు వ్యవస్థను రూపుమాపడానికి కేసీఆర్ జీఓ 22ను, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు జీఓ నెం.16ను విడుదల చేసినప్పటికీ రెగ్యులరైజేషన్ ప్రక్రియ నత్తనడకన కొనసాగుతుందన్నారు. వెంటనే క్రమబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, నర్సింహ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్వర్రావు, వెంకట్రాములు, జమ్మన్న, శ్రీధర్‌బాబు, పి.రామచంద్రారెడ్డి, ఆనంతరెడ్డి, సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు. -
'సాహసోపేత నిర్ణయం తీసుకున్న కేసీఆర్'
హైదరాబాద్: శ్రమదోపిడీ చేసే కాంట్రాక్ట్ విధానాన్ని చంద్రబాబు తెస్తే రెగ్యులరైజ్ చేసే సాహసోపేత నిర్ణయం కేసీఆర్ తీసుకున్నారని తెలంగాణ కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు కనక చంద్రం అన్నారు. 15 ఏళ్లుగా కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉద్యోగాలు చేస్తున్నామని, తమ ఆవేదనను అర్థం చేసుకుని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఉన్న ఉద్యోగాల్లోనే తాము కొనసాగుతామని స్పష్టం చేశారు. కొత్త ఉద్యోగాలను తెలంగాణ యువత సాధించుకోవచ్చని సూచించారు. అంతకుముందు తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారావును తెలంగాణ కాంట్రాక్ట్ ఉద్యోగ సంఘం ప్రతినిధులు కలిశారు. తమ సమస్యల గురించి మంత్రికి వివరించారు. తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.