'సాహసోపేత నిర్ణయం తీసుకున్న కేసీఆర్' | Kcr take daring decision on Contract Employees Regularise | Sakshi
Sakshi News home page

'సాహసోపేత నిర్ణయం తీసుకున్న కేసీఆర్'

Jul 22 2014 5:54 PM | Updated on Aug 15 2018 9:20 PM

'సాహసోపేత నిర్ణయం తీసుకున్న కేసీఆర్' - Sakshi

'సాహసోపేత నిర్ణయం తీసుకున్న కేసీఆర్'

శ్రమదోపిడీ చేసే కాంట్రాక్ట్ విధానాన్ని చంద్రబాబు తెస్తే రెగ్యులరైజ్ చేసే సాహసోపేత నిర్ణయం కేసీఆర్ తీసుకున్నారని తెలంగాణ కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు కనక చంద్రం అన్నారు.

హైదరాబాద్: శ్రమదోపిడీ చేసే కాంట్రాక్ట్ విధానాన్ని చంద్రబాబు తెస్తే రెగ్యులరైజ్ చేసే సాహసోపేత నిర్ణయం కేసీఆర్ తీసుకున్నారని తెలంగాణ కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు కనక చంద్రం అన్నారు. 15 ఏళ్లుగా కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉద్యోగాలు చేస్తున్నామని, తమ ఆవేదనను అర్థం చేసుకుని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఉన్న ఉద్యోగాల్లోనే తాము కొనసాగుతామని స్పష్టం చేశారు. కొత్త ఉద్యోగాలను తెలంగాణ యువత సాధించుకోవచ్చని సూచించారు. అంతకుముందు తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారావును తెలంగాణ కాంట్రాక్ట్ ఉద్యోగ సంఘం ప్రతినిధులు కలిశారు. తమ సమస్యల గురించి మంత్రికి వివరించారు. తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement