breaking news
Employees Regularise
-
జాబ్స్, అడ్మిషన్స్ అలర్ట్స్
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది. అసోసియేట్ ప్రొఫెసర్ అర్హతలు: మీడియా స్టడీస్/ కమ్యూనికేషన్/ జర్నలి జంలో పీహెచ్‌డీతో పాటు 12 ఏళ్ల అనుభవం ఉండాలి. ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 31 వెబ్సైట్: www.iimc.nic.in భారత్ బ్రాడ్‌బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ భారత్ బ్రాడ్‌బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ (బీబీఎన్ఎల్) వివిధ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ అర్హతలు: బీఈ/ బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ ఎంపిక: గేట్-2014 స్కోర్ ద్వారా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్: జనవరి 15 నుంచి ఫిబ్రవరి 27 వెబ్సైట్: www.bbnl.nic.in ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ అర్హతలు: 60 శాతం మార్కులతో ఎమ్మెస్సీ/ఎంటెక్(బయోటెక్నాలజీ) ఉత్తీర్ణత. దరఖాస్తు విధానం: గేట్ 2015 రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిన తర్వాత ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక: గేట్ స్కోరు ఆధారంగా గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్: డిసెంబర్ 20 నుంచి జనవరి 19 వెబ్సైట్: www.ntpc.co.in నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ జైపూర్‌లోని చౌదరి చరణ్‌సింగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ కింది కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ అగ్రి-బిజినెస్ మేనేజ్మెంట్ అర్హతలు: అగ్రికల్చర్/ వెటర్నరీ సైన్స్/ డెయిరీ టెక్నాలజీ/ ఫుడ్ టెక్నాలజీ/ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ ఉండాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జనవరి 31, 2015 వెబ్సైట్: www.ccsniam.gov.in కాంపిటీటివ్ కౌన్సెలింగ్: డీఎస్సీ బయాలజీ మెథడ్స డీఎస్సీ బయాలజీ మెథడ్సలో ‘ఉద్దేశాలు- విలువల’కు సంబంధించి ఎలా అధ్యయనం చేయాలి? ఏ విధంగా చదివితే విలువలను సులువుగా గుర్తుంచుకోవచ్చు? -కె.రాగసుధ, అల్వాల్ ‘ఉద్దేశాలు-విలువలు- సహ సంబంధం’ చాప్టర్లో ఉద్దేశం- లక్ష్యానికి మధ్య ఉన్న భేదాలపై అవగాహన పెంచుకోవాలి. భావనలు, వాటికి సరైన ఉదాహరణలను క్షుణ్నంగా అవగాహన చేసుకోవడం వల్ల సమాధానాలను తేలికగా గుర్తించవచ్చు. విలువలకు సంబంధించి ఎక్కువగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి లక్షణాలకు (సత్య శీలత, నిజాయతీ, నిష్పాక్షికత, ఓర్పు) సంబంధించింది నైతిక విలువగా, జ్ఞానానికి సంబంధించింది బౌద్ధిక విలువగా, దైనందిన జీవితంలో పాఠ్యాంశంగా ఉపయోగపడితే ఉపయోగాత్మక విలువగా, వృత్తిని ఎంచుకుంటే- వృత్తి పరమైన విలువగా, ప్రకృతిని అభినందిస్తే సౌందర్య విలువగా, కొత్త ఆలోచనలు వస్తే సృజనాత్మక విలువగా గుర్తుం చుకోవాలి. అప్పుడే విలువలకు సంబంధించిన ప్రశ్నలకు సరైన ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ఇదే చాప్టర్ చివరలో సహ సంబంధం ఉంది. ఇచ్చిన ఉదాహరణలను బట్టి ఏ శాస్త్రాల మధ్య సహ సంబంధం ఉందో అవగాహన చేసుకోవాలి. జీవశాస్త్ర పాఠ్యాంశాల్లో ఏయే శాస్త్రాల పరిజ్ఞానం అవసరమవుతుందో విశ్లేషణాత్మకంగా ఆలోచించి సమాధానం ఎంచుకోవాలి. ఇన్పుట్స్: ఎస్.పి.డి. పుష్పరాజ్, సీనియర్ ఫ్యాకల్టీ -
'సాహసోపేత నిర్ణయం తీసుకున్న కేసీఆర్'
హైదరాబాద్: శ్రమదోపిడీ చేసే కాంట్రాక్ట్ విధానాన్ని చంద్రబాబు తెస్తే రెగ్యులరైజ్ చేసే సాహసోపేత నిర్ణయం కేసీఆర్ తీసుకున్నారని తెలంగాణ కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు కనక చంద్రం అన్నారు. 15 ఏళ్లుగా కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉద్యోగాలు చేస్తున్నామని, తమ ఆవేదనను అర్థం చేసుకుని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఉన్న ఉద్యోగాల్లోనే తాము కొనసాగుతామని స్పష్టం చేశారు. కొత్త ఉద్యోగాలను తెలంగాణ యువత సాధించుకోవచ్చని సూచించారు. అంతకుముందు తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారావును తెలంగాణ కాంట్రాక్ట్ ఉద్యోగ సంఘం ప్రతినిధులు కలిశారు. తమ సమస్యల గురించి మంత్రికి వివరించారు. తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.